Sunday, September 8, 2024
Homeతెలంగాణలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు ఘన సన్మానం...

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు ఘన సన్మానం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకు ఘన సన్మానం.

సుల్తానాబాద్,జులై,26 (కలం శ్రీ న్యూస్): లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక స్వప్న కాలనీలో జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికులకు జ్ఞాపికలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు, ప్రతినిధులు మాట్లాడుతూ. భారత్ పాకిస్తాన్ మధ్య 1998 లో కుదిరిన కాశ్మీర్ శాంతి ఒప్పందం (లాహోర్ డిక్లరేషన్)ను ఉల్లంఘించి కాశ్మీర్ ను ఆక్రమించుకోవడానికి దొడ్డి దారిన భారత భూభాగంలోని కార్గిల్ సెక్టర్ లో ధ్రాస్, బటాలిక్, టైగర్ హిల్స్ వంటి ప్రాంతాలలో పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు చొరబడగా తప్పనిసరి పరిస్థితులలో మన భారత దేశం ఆపరేషన్ విజయ్ పేరుతో దాదాపు రెండు లక్షల మంది సైనికులతో మూడు నెలల పాటు అత్యంత ప్రతికూల పరిస్థితులలో వీరోచితంగా పోరాడి 1999, జులై 26న తిరిగి మన స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ యుద్ధంలో 527 మంది సైనికులు అమరులైనారు. దేశం కోసం తమ ప్రాణాలకు తెగించి యుద్ధం చేసిన భారత సైనికుల ధైర్య సాహసాలకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ సైనికులు తమను సత్కరించినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ లయన్స్ క్లబ్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, జూలూరి అశోక్, కార్యదర్శి పిట్టల వెంకటేశం, కోశాధికారి పూసాల సాంబమూర్తి,రాయల్ల నవీన్, తమ్మన వేణి సతీష్,మాజీ సైనికులు నారాయణ, వెంకటస్వామి, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!