పర్యావరణ హిత మట్టి వినాయకులను పూజిద్దాం.
మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు.
సుల్తానాబాద్,సెప్టెంబర్7(కలం శ్రీ న్యూస్):
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు పిలుపునిచ్చారు. శనివారం మున్సిపల్ కార్యాలయఆవరణలో పట్టణ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను చైర్ పర్సన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పరచడం లో భాగంగా మున్సిపల్ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ బిరుదు సమత కృష్ణ, మున్సిపల్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.