పర్యావరణాన్ని పరిరక్షించుట ప్రతి ఒక్కరి బాధ్యత
యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్
సుల్తానాబాద్,సెప్టెంబర్6(కలం శ్రీ న్యూస్):
సుల్తానాబాద్ యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 16వ సంవత్సరం 1500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ఈ మహా యజ్ఞం ప్రతి సంవత్సరం సుల్తానాబాద్ ప్రాంత ప్రజలకు ఉచిత మట్టి వినాయక విగ్రహాలను ఇవ్వడం జరుగుతుందని, ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం కోసం నా సొంత డబ్బుల తో ఈ మట్టి వినాయక విగ్రహాలను తెప్పించి ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు తమతమ ఇండ్లలో మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని, ప్రతి జీవి కూడా అలాగే వరాలు తీసుకొని వస్తుందని మనమైతే స్వేచ్ఛ స్వతంత్ర తోటి ఎలా బతుకుతున్నామో అలాగే నీటిలో ఎన్నో జీవరాసులు జీవిస్తూ ఉంటాయని వాటిని హరించే హక్కు ఎవరికీ లేదని మనకైతే దేవునికి మొక్కి మోక్షము ఇయ్యాలని కలర్ విగ్రహాలను నీటిలో వేయడం వల్ల నీటిలో ఎన్నో జీవరాసులు ఉంటాయని, ఈ కెమికల్ తో కూడిన విగ్రహాలను పూజించి నీటిలో వేయడం ద్వారా ఎన్నో జీవులు మరణానికి మనం కారణమవుతామని, దీన్ని ఉద్దేశించి గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ బత్తుల ఆంజనేయులు-రక్షిత, తుమ్మ వెంకటేశం, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మ నిశాంత్, సామాజిక కార్యకర్త గాల పెళ్లి కుమార్, పురోహితులు వీరాచారి, అల్లంకి సంపత్, శ్రీరాముల కమలాకర్, మాడురి సందీప్ తదితరులు పాల్గొన్నారు.