Sunday, September 8, 2024
Homeతెలంగాణఅనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

బూడిద గణేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి

మంథని,జులై26(కలం శ్రీ న్యూస్):

మంథని మున్సిపల్ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ లపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్.ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని మున్సిపల్ పరిధిలో శ్రీరామ వాటర్ ప్లాంట్, మధురం వాటర్ ప్లాంట్ తో పాటు 8 వాటర్ ప్లాంట్ లు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ప్లాంట్లను నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా కెమికల్ వాడుతున్నారని అన్నారు. పరిశుభ్రత పాటించకుండా వాటర్ క్యాన్లను శుభ్రం చేయకుండా పాకురు పట్టిన క్యాన్లతో నీటిని సరఫరా చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా అధిక ధరలకు నీటిని విక్రయిస్తూ ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. మంథని లో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని అన్నారు. వర్షాకాల సమయంలో ఇలాంటి కలుషితమైన నీరు తాగడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అనధికారికంగా నిర్వహించబడుతున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!