Sunday, September 8, 2024
Homeతెలంగాణసంకట హర చతుర్థి వేడుకలు 

సంకట హర చతుర్థి వేడుకలు 

 సంకష్టహర చతుర్థి వేడుకలు 

గణనాథున్ని దర్శించుకుని పునీతులైన భక్తులు 

మంథని,జులై24(కలం శ్రీ న్యూస్):గణనాథున్ని పూజిస్తే అంతా శుభం జరుగుతుంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా బుధవారం గణనాథుని ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొత్తగా చతుర్థి చేసిన వారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఒక ఆనవాయితీ. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టడం అనాదిగా పాటిస్తున్న నియమం. సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేసి మోజపులు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువుతీరిన గణనాథున్ని సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది. ఈ రోజున రాత్రి 9 గంటల 34 నిమిషములకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజ చేసి భోజనం చేయడం ఎంతో శ్రేయష్కారంగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉపవాస దీక్ష స్వీకరిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న విజ్ఞాలన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీ మహా గణపతి దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు. దేవతలలో మొట్టమొదట పూజించబడే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వరున్ని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందనే విశ్వాసంతో సంకష్టహర చతుర్థి దీక్షను స్వీకరిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరిక (దూర్వాలు) సమర్పించడం అలాగే 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రలవుతారు అని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ రోజున చంద్రోదయం అనంతరం భోజనం చేయడం ఈ దీక్షలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయ పూజారి పల్లి రాము భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!