Sunday, September 8, 2024
Homeతెలంగాణలయన్స్ క్లబ్,ఐపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవ భారీ ర్యాలీ.

లయన్స్ క్లబ్,ఐపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవ భారీ ర్యాలీ.

లయన్స్ క్లబ్,ఐపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవ భారీ ర్యాలీ

సుల్తానాబాద్,జులై 22 (కలం శ్రీ న్యూస్):

లయన్స్ క్లబ్,ఐపీఎస్ పాఠశాల ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలో సోమవారం జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా మొదటి ఉప గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాములు,సీఐ సుబ్బారెడ్డి జెండా ఊపి జాతీయ పతాక ర్యాలీని ప్రారంభించారు.లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా 100 మీటర్ల భారీ త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని పట్టణ పురవీధుల గుండా దేశభక్తి నినాదాలతో,ఆట పాటలతో నృత్యాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యాన్ని పొందిన మన దేశ పౌరులకు స్ఫూర్తినిస్తూ జాతీయ సమైక్యతను పెంపొందించడంలో భాగంగా పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన మన భారత రాజ్యాంగం ఆమోదం తెలిపిందని, దాని యొక్క గొప్పతనాన్ని పవిత్రతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను విధేయతను చూపాలని, సభ్య దేశాలలో అది సగర్వంగా ఎగిరేటట్లు చూడాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రవణ్ కుమార్,  క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్,జి.ఎల్.టి మిట్టపల్లి ప్రవీణ్ కుమార్,జిల్లా కో ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్,జూలూరి అశోక్ సభ్యులు పిట్టల వెంకటేశం,పూసాల సాంబమూర్తి,గజబీంకర్ జగన్, నాగమల్ల ప్రశాంత్, చకిలం వెంకటేశ్వర్లు,పూసాల రామకృష్ణ,తూర్పాటి భార్గవ్ కృష్ణ, ఐపీఎస్ పాఠశాల డైరెక్టర్ మాటేటి క్రిష్ణ ప్రియ విద్యార్థినీ విద్యార్థులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!