Sunday, September 8, 2024
Homeతెలంగాణలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

సుల్తానాబాద్,జులై21(కలం శ్రీ న్యూస్):

లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో గురు పూర్ణిమను పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసిన అనంతరం శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది.

ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. గురు బ్రహ్మ: గురు విష్ణు: గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుని తరువాత భారతీయ సంస్కృతిలో పూర్వం నుండి గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గురువు అంటే అజ్ఞానం అనే చీకటి పొరలను పారద్రోలి జ్ఞానమనే వెలుతురును అందించే ఒక గొప్ప శక్తి అని, పూర్వకాలంలో వేదాలను ఏకం చేసి పంచమ వేదంగా మహాభారతాన్ని వినాయకుడి సాయంతో గ్రంథస్థం చేసి ప్రపంచ మానవాళికి దిశా నిర్దేశం చేసిన వ్యాస మహర్షికి కృతజ్ఞతగా ప్రతిఏటా జూలై 21న ఆషాడ మాస శుద్ధ పంచమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్, కోశాధికారి పూసాల సాంబమూర్తి, సభ్యులు చకిలం వెంకటేశ్వర్లు, నాగమల్ల ప్రశాంత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు కొమ్ము కుమార్, మహమ్మద్ ఆరిఫ్, పురం సునీత, వినయ్, సాయిబాబా ఆలయ పురోహితులు సంజయ్, పాఠశాల డైరెక్టర్ మాటేటి క్రిష్ణప్రియ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!