Sunday, September 8, 2024
Homeతెలంగాణజర్నలిస్టు అంటే ఏమైనా చేయొచ్చా 

జర్నలిస్టు అంటే ఏమైనా చేయొచ్చా 

జర్నలిస్టు అంటే ఏమైనా చేయొచ్చా 

సుల్తానాబాద్,జులై18(కలం శ్రీ న్యూస్):

జర్నలిస్టు అంటే ఫోర్త్ ఎస్టేట్. జర్నలిస్టు అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. అలాంటి ఒక జర్నలిస్టు అవినీతి, అక్రమణాలకు, సెటిల్ మెంట్ దందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. పూర్తి వివరాలకు వెళ్తే పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పేరు మోసిన పత్రిక రిపోర్టర్ పై వాటికి పూర్తి నిదర్శనం. 18 సంవత్సరాల అనుభవం గల సీనియర్ రిపోర్టర్ ను అని చెప్పుకొని తిరగడం అతని నైజం. అధికారులు నాయకుల అండదండలు ఉన్నాయని చెప్పుకోవడం అతని ఫ్యాషన్. నన్ను ఎవడు ఏం చేయలేడు నేనే కింగ్ మేకర్ ను అని చెప్పుకోవడం అతని హాబీ. పోనీ 18 సంవత్సరాల నుండి అతని పని చేస్తున్నాడా అంటే అది లేదు. అతని కి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. పోనీ భార్య, పిల్లలు ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నారా  అంటే అది లేదు. అతడు చేసే పనులు మొత్తం సెటిల్ మెంట్ లు మాత్రమే. ఇది చాలా నట్టుగా చిరు వ్యాపారులను టార్గెట్ చేస్తూ, అధిక వడ్డీ వసూలు చేస్తూ, అనుమతి లేని ఫైనాన్సు దందా నడిపించడం అతని వృత్తి.సుమారు 5 రూపాయల వడ్డీ కి డబ్బులు ఫైనాన్స్ ఇవ్వడం. అలా అని అతనికి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి లేదు, డబ్బు లేదు. అతని ఆస్తి మొత్తం, డబ్బు మొత్తం అక్రమ సంపాదననే. దానితో సరిపెట్టుకోకుండా అతడి కన్ను సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లోని ఒక రోడ్డుపై పడింది. గతంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఆ రోడ్డుకు సి.సి నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఆ తాజా మాజీ ఎమ్మెల్యే పేరుకే శంకుస్థాపన చేశాడు. కానీ రోడ్డు నిర్మాణం చేపట్టిన లేదు, ఏది లేదు, ఇది అదునగా భావించిన ఆ సదరు సీనియర్ రిపోర్టర్ ఆ రోడ్డును అధికారుల, నాయకుల అండదండలతో ఆక్రమించుకొని ఏకంగా తన కార్ పార్కింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇంకేమైనా అంటే ఈ రోడ్డు స్థలం నాదే మీకు దిక్కున చోటు చెప్పుకోండి అని, నాకు నాయకులు తెలుసు, అధికారులు తెలుసు నన్ను ఎవరేం చేయలేరని బెదిరింపులకు గురి చేస్తున్నాడు.దీనితో ఏమి చేయని దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు కాలనీవాసులు. ఏది ఏమైనా ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, ఆ వార్డ్ కౌన్సిలర్, సంబంధిత అధికారులు, నాయకులు తక్షణమే స్పందించి ఆ సీనియర్ రిపోర్టర్ చేతిలో కబ్జాకు గురైన రోడ్డును గుర్తించి, ఆ రోడ్డును ప్రజలకు అప్పగించి, ఆ సీనియర్ రిపోర్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!