Sunday, September 8, 2024
Homeతెలంగాణవైభవంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు 

వైభవంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు 

వైభవంగా తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు 

వైష్ణవ ఆలయాలలో ప్రత్యేక పూజలు

సుల్తానాబాద్,జులై17(కలం శ్రీ న్యూస్):

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు వైభవంగా వేడుకలు నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి, తమ తమ గృహాలలో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మూల స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు అలంకరించి, పెద్ద ఎత్తున పూలమాలలు సమర్పించి, స్వామివారిని భక్తుల సందర్శనార్థం అనుమతించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పండ్లు, ఫలహారాలు, వస్త్రాలు, పూలు తదితర వాటిని సమర్పించారు. సంవత్సరంలో 24 ఏకాదశి రావడం అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఆషాడశుద్ధ ఏకాదశి మాత్రం హిందువులకు తొలి పండుగగా ఆచరిస్తారు. ఈ తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని ప్రజలు భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకున్నారు. ఆలయంలో సామూహిక విష్ణు సహస్రనామాల పారాయణం నిర్వహించారు. ఆలయ చైర్మన్ పల్లా మురళి సదాలక్ష్మి దంపతులు , వికాస తరంగిణి అధ్యక్షులు సాదుల సుగుణాకర్ తదితరులు పాల్గొని అభిషేక కార్యక్రమం పూజలు ప్రారంభించారు. అనంతరం ఆలయ అర్చకులు సావిత్రి శ్రావణ్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!