Sunday, September 8, 2024
Homeతెలంగాణవిద్యార్థులు వ్యవసాయం పై అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థులు వ్యవసాయం పై అవగాహన కలిగి ఉండాలి

విద్యార్థులు వ్యవసాయం పై అవగాహన కలిగి ఉండాలి

సెయింట్ మేరీస్ కరెస్పాండెంట్ శౌరెడ్డి

సుల్తానాబాద్,జులై13(కలం శ్రీ న్యూస్): మనదేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం అని, విద్యార్థులు విద్యార్థి దశ నుండే వ్యవసాయం పై అవగాహన కలిగి ఉంటే మున్ముందు ఎన్నో నూతన ఉత్పత్తులకు కారణ భూతులవుతారని సుల్తానాబాద్ సెయింట్ మేరీస్ కరెస్పాండెంట్ హెచ్ఎం ఫాదర్ కాసు శౌరెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామంలోని పొలాలలో ఫాదర్ శౌరెడ్డి, ఉపాధ్యాయిని లు రజిత, జవేరియా ల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఒక రైతు వరి ధాన్యం పండించడానికి అవలంభించే పద్దతులను స్వయంగా విద్యార్థులకు వివరిస్తూ వారితో పంట పొలాలలో పొలం పనులు చేయిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫాదర్ శౌరెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రపంచానికి వెన్నెముక వంటివారని, రైతును రాజు అనేకంటే చక్రవర్తి అని సంభోధిస్తే సరైన పిలుపు అని అన్నారు. వ్యవసాయం చేస్తూ రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు, నీటి ఎద్దడి, చీడపీడలు అన్నారు. జూలై నెలలో వర్షాలు కురిసి నప్పుడు వంటలు వేస్తారని, వర్షాలు బాగా కురుస్తే పంటలు బాగా పండుతాయని లేని ఎడల ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. వర్షానికి ప్రత్యామ్నాయంగా బోరుబావులు, కెనాల్ వాటర్, బావుల పైన ఆధారపడతారన్నారు. తమ పిల్లలను చదివించడం కోసం రైతులు పొల్లాల్లో పడుతున్న కష్టాలను కళ్లారా చూపించడం ముఖ్య ఉద్దేశమన్నారు. అంతే కాకుండా విద్యార్థులు చదువుల్లో డాక్టర్, ఇంజనీర్, లాయర్ అన్న అతికొద్ది కోర్సులనే కాకుండా వ్యవసాయం పై కూడా ఆసక్తి కలిగి ఉంటే మున్ముందు ప్రత్యామ్నాయ మార్గాలు – ఆలోచించి గొప్ప వ్యవసాయ సైంటిస్ట్లుగా ఎదిగి రైతులకు అండగా నిలుస్తారన్న సదుద్దేశంతోనే నేటి కార్యక్రమం చేపట్టామని ఇందుకు సహకరించిన రైతులకు, ఉపాధ్యాయినిలకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థిని శశికావ్య మాట్లాడుతూ..    వ్యవసాయం అనేది మానవ నాగరికత అని, మనుగడకు అనేక లాభాలను కలిగి ఉన్నాయని,వ్యవసాయం అనేది రైతులకు వెన్నెముక మంటిదని, రైతులే లేకుంటే మనమే లేమని, రైతుల వల్లనే మనం బ్రతుకుతున్నామని, రాత్రి అనగా పగలనక చాలా కష్టపడి రైతులు మనకొసం ఆహారధాన్యాలను పండిస్తున్నారని, అందుకే వారికి మనం ప్రత్యేక గౌరవం ఇవ్వాలని కోరారు.మరో విద్యార్థి సంజయ్ మాట్లాడుతూ.రైతులు ఒక పద్దతి ద్వారా మొక్కలను, జంతువులను పెంచి నిర్థిష్టమైన పద్దతిలో ఆహారాన్ని ఉత్పత్తి చేయడాన్నే వ్యవసాయం అంటారని, రైతులు ఎంతో కష్టపడి మనకోసం లాభాపేక్షలేకుండా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారని, భారత దేశంలోని సారవంతమైన భూముల్లో ఎన్నోరకాల వంటలు వండుతాయని, రైతులు పంటలు పండించడం ద్వారా ప్రపంచంలోనే ఆహారకొరత లేకుండా ఉంటుందని, రైతులు లేకపోతే దేశంలో ఆకలి ఛావులతో మిగిలిపోతుందని,కాబట్టి వీలైనంతలో రైతులకు పంటలు పండించడంలో సహాయం చేయాలని కోరారు.విద్యార్థి గౌరవ్ మాట్లాడుతూ .వ్యవసాయం అనేది దేశానికి వెన్నెముకవంటిదని, మనదేశంలో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న ఉద్యోగం వ్యవసాయం. మన దేశంలో రబీ, ఖరీఫ్ అనే రెండు రకాల పంటలు వేస్తారని, చాలా ముఖ్యమైన పంటల్లో వరి, మొక్కజొన్న, గోదుమలు, చిరుధాన్యాలు. మొట్టమొదటిగా వ్యవసాయం అనేది దేశానికి వెన్నెముక వంటిదని తెలిపారు.

అనంతరం రైతు సంపత్(ఐతరాజుపల్లి)మాట్లాడుతూ ..వ్యవసాయమనేది చాలా కష్టసాధ్యమైన పని అని, వ్యవసాయం చేయాలంటే నీళ్లు, కరెంటు, కాలం సరిగా ఉండాలని, పంట బాగా పండాలంటే మందు బస్తాలు ఉండాలని,ఈ మధ్య మందు బస్తాల రెట్లు మండి పోతున్నాయని, ముఖ్యంగా  పెట్టుబడి కోసం డబ్బులు సరిపడా ఉండాలని, రైతుల కష్టాలు చిన్నారులు పడకుండా ఉండాలంటే ముఖ్యంగా చదువుకొని మంచి జాబ్ చేసుకోవడమే కాకుండా రైతులకు తమవంతుగా సహాయసహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డ్రైవర్ తోటపల్లి సంతోష్, ఉపాధ్యాయినిలు ఎస్. రజిత, జవేరియా, రైతు సంపత్, లతోపాటు సుల్తానాబాద్ సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఎనిమిదవ తరగతి విద్యార్థినీ, విద్యార్థులు, రైతుకూలీలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!