Sunday, September 8, 2024
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు అంజన్న సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్న సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జగిత్యాల,జూన్ 29(కలం శ్రీ న్యూస్):

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను చేసేందుకు స్థాని కులు భారీగా ఆలయానికి తరలివచ్చారు.

ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉద యం ఆయన కొండగట్టుకు బయల్దేరారు.ఆయనకు దారి పొడవునా అభిమా నులు ఘనస్వాగతం పలికారు. ముందుగా హైదరాబాద్‌ శివారులోని తుర్కపల్లిలో పవన్‌ కల్యాణ్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు.

తుర్కపల్లి నుంచి బయల్దేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి వద్ద కూడా జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్‌ కల్యాణ్‌ను గజమాలతో సత్కరించారు.అనంతరం అభిమానులు అందించిన వీరఖడ్గంతో ఆయన ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయల్దేరి వచ్చారు.

ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్‌ కల్యాణ్‌ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్టతో ఈ దీక్షను పాటించ నున్నారు. ఈ క్రమంలోనే తమ ఇల వేల్పు అయిన కొండగట్టు ఆంజ నేయ స్వామిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కాగా, గత ఏడాది ఎన్నికల కు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్‌ కల్యాణ్‌.. తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయిం చారు. అనంతరం వారాహి విజయయాత్రను నిర్వహించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!