హీరా గోల్డ్ ఆస్తులను కబ్జా దారుల నుంచి రక్షించండి.
- ఈ ఆస్తులన్ని ఇన్వెస్టర్ల కష్టార్జితం.
- కబ్జాదారులు ఎవరైనా ఉపేక్షించేది లేదు.
- చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
హీరా గ్రూప్ అధినేత డాక్టర్ నౌ హిరా షేఖ్.
హైదరాబాద్, జూన్ 28(కలం శ్రీ న్యూస్):
హీరా గ్రూప్ అధినేత డాక్టర్ నౌ హిరా షేఖ్ తన ఆస్తులను భూ కబ్జాదారులు ఆక్రమించడం పై చర్యలు ప్రారంభించారు. ఖబ్జాదారులపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేశారు.హైదరాబాదులోని తన ఆస్తులను అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారని,తనను రాజకీయ కక్ష తో కేసుల్లో ఇరికించి తన పై తప్పుడు అభియోగాలు మోపి తన కంపెనీ హీరా గోల్డ్ ను కష్టాల్లో నెట్టేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.తనపై కక్ష కట్టి జైలుకు పంపారని, ఆ తర్వాత తన ఆస్తులను కబ్జా చేసుకునేందుకు పక్కా ప్లానింగ్ తో పని చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధీకరణ చేసిన ఆస్తులు కూడ ఆక్రమణ కు గురవుతున్నాయని తెలిపారు.తాను సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నానని, తనకు సుప్రీం కోర్ట్ వ్యాపారం చేసుకునే అనుమతి ఇచ్చిందని, తద్వారా నేను నా ఇన్వెస్టర్ల నగదును తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.తన కంపెనీ హీరా గోల్డ్ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల నగదు చెల్లించేందుకు తన ఆస్తులను అమ్మాల్సి ఉంటుందని,అందుకు తనను అడ్డుకుంటున్నారని వాపోయారు. హీరా గోల్డ్ ఆస్తులను అక్రమంగా కబ్జా చేసుకొంటున్న ఎవరిని కూడ ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.తన ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, ఈ సందర్భంగా కబ్జాదారులకు హెచ్చరించారు.కంపని ఆస్తులన్నీ ఇన్వెస్టర్లకు సంబంధించినవని, తాను ఆస్తులు అన్ని తన ఖాతాదారులకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. తన ఆస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలు డాక్యుమెంట్లు ఉన్నాయని కబ్జాదారుల వద్ద ఏమీ లేవని నకిలీ పత్రాలతో యదేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారని వివరించారు తనపై కక్షపూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని తాను ఎవరికి భయపడనని న్యాయ పోరాటం చేసి కబ్జాదారులను శిక్షపడేలా చేస్తానని హెచ్చరించారు.