Sunday, September 8, 2024
Homeతెలంగాణతెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ: ఎండి సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ: ఎండి సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాల భర్తీ: ఎండి సజ్జనార్

హైదరాబాద్:జూన్ 02(కలం శ్రీ న్యూస్):

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీలో ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త‌గా 2990 బ‌స్సుల‌ను ద‌శ‌లవారీగా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని, అందుకు అనుగుణంగా మూడు వేల ఉద్యోగాలు త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌నున్నామ‌ని మేనేజింగ్ డైరెక్టర్ స‌జ్జ‌నార్‌ అన్నారు.

హైదరాబాద్ లోని బస్ భవ న్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వ‌ హించారు. ఈ సంద‌ర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమం లో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు.అనంతరం టీజీఎస్ఆర్టీసీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిం చారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌నార్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని పేర్కొ న్నారు. తెలంగాణ ఉద్య మంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చరిత్రలో నిలిచి పోయింద‌న్నారు. మహాలక్ష్మి పథక అమలుకు ముందు ప్రతి రోజు సగటున 45 లక్షల మంది ప్రయాణిస్తే, ప్రస్తుతం రోజుకి సగటున 55 లక్షల మంది రాక‌పోక‌లు సాగిస్తున్నార‌ని తెలిపారు.మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2000 కొత్త డీజిల్, 990 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారిగా వాడకంలోకి తీసుకురావాలని యాజ మాన్యం నిర్ణయించిందని తెలిపారు. డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలుపుకుని మొత్తంగా 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త బస్సులకు అనుగుణంగా 3 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయిం చిందని తెలిపారు. ప్రభుత్వ అనుమతితో వాటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!