Tuesday, September 17, 2024
Homeతెలంగాణసెయింట్ మేరీస్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

సెయింట్ మేరీస్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

సెయింట్ మేరీస్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

సుల్తానాబాద్(జనవరి 26),(కలం శ్రీ న్యూస్): సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కరెస్పాండెంట్  ప్రిన్సిపాల్ తుమ్మ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థు లు ఫాదర్ అశోక్ రెడ్డి, అసిస్టెంట్ ఫాదర్ ప్రభాకర్ లను మేళ తాళాలతో సాదరంగా వేదిక మీదకు ఆహ్వానించారు. అనంతరం ఫాదర్ అశోక్ రెడ్డి పతాకావిష్కరణ చేసి అందరితో కలిసి జాతీయ గీతాలాపన చేసారు. ఈ సందర్భంగా ఫాదర్ అశోక్ రెడ్డి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన దేశ స్వాతంత్య్రం బీ ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకొని పూర్తిగా మన పాలనలో గణతంత్ర దేశంగా రూపుదిద్దుకున్న రోజును పురస్కరించుకొని జనవరి 26 ను గణతంత్ర జెండా పండుగ లా జరుపుకుంటున్నామని వివరించారు. స్వాతంత్ర్య సమార యోధుల గురించి, వారి పోరాటాల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చిన్నారులు దేశ భక్తి చాటేవిధంగా నిర్వహించి, ఆలపించిన ఆట,పాటలు అలరించాయి. చిన్నారులు గొప్ప గొప్ప దేశ భక్తుల వేషధారణలు చూపరులను కట్టి పడేశాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వసంత పంచమిని పురస్కరించుకొని నిర్సరీ చిన్నారులకు పలకలు,పెన్సిల్ లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టింట్ ఫాదర్ ప్రభాకర్, ఏ సంపత్, కే సతీష్,ఎస్ కమలాకర్,బి కుమారస్వామి,ప్రవీణ్,రాకేష్,హరీష్,సిస్టర్స్ ఫ్లోరీ,మరియా,రషీదా,నీరజ,జవేరియా,మల్లీశ్వరి,హెలెన్,అనూష,ఎం.శారదా,ఉమా,ఎస్.రజిత,అంజూరాణి,సరోజన,శిరీష,ఆర్.స్వప్న,నందిని,రజిత,అనిత,అర్చన,సరిత,స్వప్న,సిబ్బందిసురేష్,మాలిక్,శైలజ,సర,సాగర్,సంపత్,రమేష్,అభి,అనిల్,శివ,సంపత్ రెడ్డి,రమేష్ ల తో పాటు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!