శభాష్ సాయికృష్ణ నీ ప్రతిభతో కల్వచర్లకు పేరు తెచ్చావు
పెద్దపల్లి,జనవరి26,(కలం శ్రీ న్యూస్):
పోర్టబుల్ ఫ్లూయిడ్ కూలింగ్ డివైజ్ పరికరం తయారుచేసి తెలంగాణ స్టేట్ ఇన్నోవేటర్ సెల్ ద్వారా ఇంటింటా ఇన్నోవేటరుగా ఎన్నికైనా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వాస్తవ్యులు ఉమామహేశ్వర ట్రేడర్స్ యజమాని కొలిపాక మల్లేష్-సరోజన దంపతుల కుమారుడు CMR ఇంజనీరింగ్ కళాశాల మూడవ సంవత్సరం విద్యార్థి కొలిపాక సాయికృష్ణకు 74వ గణతంత్ర దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికచేసిన 100 మందిలో ఒకరుగా గ్రామీణ ఆవిష్కరణ అవార్డును గ్రామ పంచాయతి ద్వారా అందించాలని ఆదేశించగా, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పంచాయతి పాలకవర్గం తరుపున గ్రామ సర్పంచ్ శ్రీమతి గంట పద్మరమణరెడ్డి అభినందనలు తెలుపుతూ శాలువాతో సత్కరించి, ప్రశంస పత్రం అందజేసి, వారి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఇన్నోవేటర్ సాయికృష్ణను కల్వచర్ల గ్రామ పద్మశాలి సేవాసంఘం తరుపున జిల్లాపద్మశాలి ఉపాధ్యక్షులు కొలిపాక సత్తయ్య, పద్మశాలి ఉద్యోగ సంఘం జిల్లా కార్యదర్శి కొలిపాక సారయ్యలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మొదట గ్రామపంచాయతి కార్యదర్శి యస్.శ్రీనివాస్ కొలిపాక సాయికృష్ణ తయారుజేసిన పరికరము గురించి, ప్రభుత్వం గుర్తించి ఎన్నికచేసిన విధం వివరించగా, తాను తయారు చేసిన ఈ పరికరం అతితక్కువ ఖర్చుతో అందరికి ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడుటకు తయారుచేసినట్లుగా తెలిపారు. ఈకార్యక్రమం ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత పెంపొంది, మరింత మంది ఇన్నోవేటరులను తయారవ్వడం కోసం ప్రభుత్వం సూచించినట్లుగా తెలిపారు. యంపిటీసి కొట్టె సందీప్, ఉపసర్పంచ్ వేము కనకయ్య, ప్రధానోపాధ్యాయులు దేవళ్ళ వనజ, ఉపాధ్యాయులు గుండేటి సత్యనారాయణ, కొండబత్తిని సత్యవతి, వార్డు సభ్యులు బూస బాపన్న, ఇరుగురాల సుశీల, కోఆప్షన్ సభ్యురాలు ఒడితెల శారద, మాజీ జడ్పీటీసి గంట వెంకటరమణరెడ్డి, మాజీ సర్పంచులు బూర్గు శంకర్ గౌడు, రేండ్ల అశోక్, పురప్రముఖులు, పాఠశాల ఉపాధ్యాయిలు, విద్యార్థులు పాల్గొని కొలిపాక సాయికృష్ణ ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.