Sunday, September 8, 2024
Homeతెలంగాణదళితులలో రాజకీయ చైతన్యం రావాలి

దళితులలో రాజకీయ చైతన్యం రావాలి

దళితులలో రాజకీయ చైతన్యం రావాలి

మంథని అక్టోబర్ 8 (కలం శ్రీ న్యూస్ ): దళితులలో 57 ఉపకులాలలో రాజకీయ చైతన్యం రావాలని ఎస్సీ 57 ఉప కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ నాయకుడు బైరి వెంకటేష్ అన్నారు.ఆదివారం మంథని పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు రాష్ట్రవ్యాప్తంగా 57 ఉపకులాలుగా 23 లక్షల జనాభా కలిగి ఉన్నప్పటికీ రాజకీయంగా చైతన్యం లేకపోవడంతో,అభివృద్ధి ఫలాలు అందటం లేదని వారు వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి దళితులలో 57 ఉపకులాలను గుర్తించి,దళితులకు 50 శాతం రిజర్వేషన్ వర్తించేలా చూడాలి, గృహలక్ష్మీనిర్మాణ పథకం 3 లక్షల రూపాయలు,ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్, విద్యార్థులకు ప్రవేశ పరీక్ష లేకుండా నవోదయ పాఠశాలలో ప్రవేశం కల్పించాలని,అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందేలా చేయాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా ఎస్సీ 57 కులాల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గడ్డం మారుతి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బాణాల రాజారామ్, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!