Sunday, September 8, 2024
Homeతెలంగాణపరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి

పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు పాటించాలి

ఏక్  తారీకు ఏక్ గంట ఏక్ సాత్ లో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్

సుల్తానాబాద్,అక్టోబర్01(కలం శ్రీ న్యూస్):పరిసరాల పరిశుభ్రత పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి స్వచ్ఛతను పాటించాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలో ఏక్ తారీకు ఏక్ గంట ఏక్ సాత్ కార్యక్రమాన్ని కౌన్సిలర్లతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ తమ పరిసరాలపై శ్రద్ధ వహించాలని, ఇంటి చుట్టూ ప్రక్కల పరిసరాలు పరిశుభ్రంగా మారాలంటే ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలని,  తద్వారా కాలనీ పరిశుభ్రంగా మారుతుందని అలాగే పట్టణం పూర్తిగా చెత్త రహిత కాలనీగా మారుతుందని అన్నారు. కాలనీలు పరిశుభ్రంగా ఉంటే ఏలాంటి రుగ్మతలు దరి చేరవని, వ్యర్థ పదార్థాలను విధిగా మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు అందించాలని, రోడ్లపై మురుగు కాలువలలో పడవేయవద్దని, ఖాళీ ప్రదేశాలలో పిచ్చి మొక్కలు లేకుండా తొలగించి శుభ్రపరచాలని సూచించారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే దోమలు ఈగలు వ్యాప్తి చెందకుండా ఉంటాయని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు విధిగా శుభ్రతను పాటించాలని సూచించారు. అనంతరం శ్రమదానం చేపట్టి పిచ్చి మొక్కలు చెత్త చెదారం వ్యర్థ పదార్థాలను తొలగించారు. ఈ సందర్భంగా కాలనీలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఆయా వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వార్డు ఆఫీసర్లు శ్రమదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ టి. మల్లికార్జున్, వైస్ చైర్మన్ బిరుదు సమత కృష్ణ, వార్డు కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ మేనేజర్ అలీముద్దీన్, ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు, పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!