చెగ్యాంలో ముంపు బాధితుల రిలే నిరాహార దీక్ష కార్యక్రమం
వెల్గటూర్,జూలై 29 (కలం శ్రీ న్యూస్):వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో ముంపు బాధితులు శనివారం రోజున రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏండ్లు గడుస్తున్న ప్రభుత్వం వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం చెల్లించడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన బాధితులను ఇప్పటికైనా సంభందిత అధికారులు స్పందించి త్వరగా నష్టపరిహారం చెల్లించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.2004లో ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన సుమారు వంద కు పైగా ఇండ్లను కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,శిథిలావస్తలో ఉన్న ఇండ్లలో వర్షాలు పడితే ఉండడం ప్రమాదంగా ఉందని తాత్కాలికంగా స్థానిక పాఠశాలలో కి తరలిస్తున్నారని.చాలాసార్లు మంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లిన పెడచెవునా పెడుతున్నాడని మమ్మల్ని ఆదుకునే నాధుడే లేడని మొరపెట్టుకుంటున్నారు.వెంటనే ముంపు బాధితులకు శాశ్వత పరిష్కారాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ చూపియ్యాలని డిమాండ్ చేశారు.ఇకనైనా ప్రభుత్వం వారు గోడును పట్టించుకుని శాశ్వత పరిష్కారం చూపేవరకు ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుందని హెచ్చరించారు.ఈ దీక్షలో చొప్పదండి రాజేశం,చొప్పదండి శంకరయ్య,ఏలేటి వేణు,కుమ్మరి ఎల్లయ్య,చొప్పదండి ప్రశాంత్,రామగిరి నవీన్,కొంకటి శంకర్,అవునూరి బాబు తదితరులు పాల్గొన్నారు.