Thursday, September 19, 2024
Homeతెలంగాణజగిత్యాల జిల్లాలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె 

జగిత్యాల జిల్లాలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె 

జగిత్యాల జిల్లాలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె 

రెగ్యులరైజ్ చెయ్యాలి అని జూనియర్ పంచాయతీ కార్యదర్శుల డిమాండ్

జగిత్యాల, ఏప్రిల్27 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వెట్టిచాకిరి బతుకుల్లో పంచాయతీ కార్యదర్శులు నగిలిపోతున్నామని. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మూడు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకో లేకపోవడమే. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగాల్సి వస్తుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ గా 3250 మంది కార్యదర్శులు, జూనియర్ కార్యదర్శులుగా 9300 మంది, ఔట్సోర్సు కింద 800మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు.రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఊసే లేదని గ్రామ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రామాలలో పనిచేసే కార్మికులు చనిపోతే ఐదు లక్షల రూపాయలు బీమా కల్పిస్తుంది.పంచాయింతీ కార్యదర్శులకు ఏది..లేకపోవడం సిగ్గుచేటని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి నుండి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నట్లు ఒకరోజు ముందే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ లకు పంచాయతీ కార్యదర్శులు వినతి పత్రాలు అందజేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో సమ్మెకు దిగాల్సిందేనని జూనియర్ కార్యదర్శుల సంఘాలు చెప్పుకొస్తున్నాయి. రాష్ట్రానికి అనేక అవార్డులు తెచ్చిన ఘనత పంచాయతీ కార్యదర్శులే అని చెప్పుకోవచ్చు. జిల్లా అధికారుల ఒత్తిడితో గ్రామపంచాయతీలో పనులను చకాచకా చేయిస్తూఅవార్డులకు ఎంపిక అయ్యేంతవరకు కృషి చేస్తున్నారు.అలాంటి పంచాయతీ కార్యదర్శులను ప్రభుత్వం పట్టింపోవడం శోచనీయమే రాష్ట్రవ్యాప్తంగా పని ఒత్తిడి భరించలేక గ్రామకార్యదర్శులు గోసపడుతున్నారు. పేరుకే వారు పంచాయతీ కార్యదర్శులు! ప్రభుత్వరంగంలోని పని విషయంలో ప్రతీ ఉద్యోగికి పరిధి అంటూ ఉంటుంది.కానీ వారికి ఈపనిచేస్తేసరిపోతుంది అని కాకుండా.. అన్ని పనులు వారే చేయాల్సి వస్తోంది.ఈ పని, ఆ పని కాకుండా పంచాయతీ పరిధిలోని అన్ని రకాలపనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత వీరికే ఉంది. ఒక జాబు చార్ట్,నిర్దిష్ట ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా తమతోప్రభుత్వంవెట్టిచాకిరిచేయిస్తోందంటూ గ్రామ కార్యదర్శులు గగ్గోలు పెడుతున్నారు.ప్రస్తుతం గ్రామ కార్యదర్శుల పరిస్థితిజిల్లాలో అగమ్యగోచరంగా మారింది.విధుల్లోకెక్కి పనుల్లో పాతబడినప్పటికీ.. ఇంకా రెగ్యులరైజ్ కాకపోవడంతో వారుఅయోమయానికిగురవుతున్నారు. గ్రామపంచాయతీకి సంబంధించిన పనులతో పాటు.. గ్రామంలో పనిచేసేఅన్ని శాఖలకు సంబంధించిన పనులనుప్రభుత్వం వారితోనే చేయించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికితోడుఅరకొరవేతనం అందజేస్తూ తాహతుకు మించి పనులు చేయిస్తుండటంతో పాటు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్నారు.దీంతోఅదనపు బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. వాస్తవానికివారు గత్యంతరం లేక ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోగ్రామంలో రోజు వారి శానిటేషన్, మొక్కల సంరక్షణ, డంపింగ్ యార్డు నిర్వహణ, రోజు వారీగా చెత్త సేకరణ, ఉపాధి హామీపనులతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా..గ్రామానికి సంబంధించి అన్ని రకాల పనులు వీరే చేయాల్సి వస్తోంది. ఇది వరకు రెవెన్యూ సిబ్బంది నిర్వహించిన విధులను సైతం తాజాగా వీరే చేపడుతున్నారు. గ్రామాల్లో పోడు సర్వేతోపాటు దస్త్రాల పరిశీలన విధులను నిర్వహిస్తున్నారు. ఉదయంఏడు గంటలకే సదరు గ్రామానికి చేరుకుని విధుల్లో చేరి గ్రామాల్లో జరిగే పనులన్నీ ఫొటోలుతీసి డీఎస్వో యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నిత్యం తమకు కేటాయించే పనులే కాకుండా గ్రామపంచాయతీకి చెందిన అన్ని శాఖలకు సంబంధించి పనులు చేస్తూ పంచాయతీ కార్యదర్శులు గోస ఎవరికి పట్టేది..??.అదనపు పనులతో సతమతం చెందుతూ ఆందోళనకు గురవుతున్నారు. పల్లె ప్రగతిలో కీలకంగా వ్యవహరించే జూనియర్ కార్యదర్శులు. సరైన జాబ్ చార్ట్, నిర్దిష్ట ప్రణాళిక లేక అన్ని పనులుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొత్తగావిధుల్లోకి వచ్చిన కార్యదర్శుల పరిస్థితి గత మూడేళ్లుగాఆందోళనకరంగా మారింది. విధుల్లోకెక్కి పనుల్లో పాత బడినప్పటికీఇంకా రెగ్యులరైజ్ కాకపోవడంతో తమ పరిస్థితి ఏంటని అయోమయంలో పడ్డారు. గడువులోపు పనులు పూర్తి చేయాలని అధికారుల ఒత్తిడితో మరింత మానసికంగా కుంగిపోతున్నారు. మానసిక ఒత్తిడి భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల మంది కొత్తగా కొలువు సాధించిన గ్రామవంచాయితీ కార్యదర్శులు కొన్నాళ్లకే ఈ ఉద్యోగం వదిలి వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో మొత్తం 9350 పైచిలుకు కొత్త పంచాయితీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో పని ఒత్తిడి, వివిధ కారణాలతోఇ ప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో కార్యదర్శులు ప్రాణాలు పోగొట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. తాజాగా గత యేడాది నవంబరులో జిల్లాలోని ఓ పంచాయితీ కార్యదర్శి పని ఒత్తిడి కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.దీంతో మున్ముందు తమ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందనే ఆందోళన కొత్త కార్యదర్శుల్లో మొదలయ్యింది. ఈ నేపథ్యంలో తమకు నిర్దిష్ట సమయంలో వని కల్పించేలా చూడాలంటూ నిరసనలు సైతంచేపడుతున్నారు.కొత్త పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిత్యం పనిభారంతో ముందుకు సాగుతున్నప్పటికీ వారి ఉద్యోగాలకు ఏ మాత్రం గ్యారంటీ లేదనిఅభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. వీరి నియామక సమయంలో తొలత మూడేళ్ల ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరును బట్టి రెగ్యులర్ అవుతుందని ప్రభుత్వం సూచించింది. వీరంతా 2019ఏప్రిల్ 11న అపాయింట్మెంట్ కాగా, అదే నెల 12న విధుల్లో చేరారు. కానీ మరో సంవత్సరం ప్రొహిబిషన్ ,పీరియడ్ పెంచి ప్రభుత్వం నాలుగేళ్లకు చేసింది.కొత్తగా విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు కింది నుంచి పైవరకు అన్ని రకాల పనులు చేస్తుండటంతో వారు విసిగెత్తి పోతున్నారు. మొత్తంగా కష్టపడి సంపాదించిన నౌకరిలో ఇలా వెట్టి చాకిరి చేయాల్సి వస్తోంది అంటూ కొందరు కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరో పక్క నిర్దిష్ట పనివేళలంటూ లేకుండా పోయాయి. ఉదయం ఏడు గంటలకు విధులకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. ఇంటికొచ్చిన తరువాత కూడా అధికారులు ఎక్కడైన దస్త్రం లేదంటే సమాచారంకావాలని ఆదేశాలిస్తే మళ్లీ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఓటు నమోదు చేయించే బీఎల్ వో బాధ్యతలు కూడా అప్పగించినట్లు చెబుతున్నారు.సర్పంచ్ లతో తప్పని తలనొప్పులు కొత్త గ్రామ కార్యదర్శులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 9350మందికి పైగా కొత్త కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు.వీరంతాఇప్పటికీ తమపరిధిలోలేనటువంటిపునలను నిత్యం చేయాల్సి వస్తోంది. ఒకవైపు ప్రొహిబేషన్ పీరియడ్ పూర్తి కాకపోవడం.. మరోవైపు రెగ్యులర్ కాలేమోనన్న భయంతో మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ లు తాము చేసిన చేయని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని,అధికార పార్టీనేతలతో ఒత్తిడికి గురి చేయిస్తున్నారని అంటున్నారు.విధులకు వెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నా మెడికల్ బెనిఫిట్స్ లేకపోవడంతో వైద్య ఖర్చులు కూడా వారే భరించాల్సివస్తోంది. కనీస ట్రావెల్స్ అలవెన్స్ కూడా ప్రభుత్వం అందజేయడం లేదంటున్నారు. ఇదే విషయంపై గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన కార్యదర్శులకు మూడు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్చేస్తామన్న హామీని అమలు చేస్తారా? లేదా? అంటూ పంచాయతీకార్యదర్శులు ఆశలు ఆవిరైపోయాయని, ప్రభుత్వంపై తిరగబడక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శులు ఏకంగా సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం సకాలంలో సమస్యలు పరిష్కరించకపోవడమే సమ్మె చేయాలని భావనలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తుందా అవుట్సోర్సింగ్ కార్యదర్శులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తుందా.. ఎస్మా ప్రయోగం చేసి ఉద్యోగులను తొలగిస్తుందా చూడాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!