పాశిగామ గ్రామంలో పోచమ్మ బోనాలకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్ లు.
వెల్గటూర్, ఏప్రిల్ 27 (కలం శ్రీ న్యూస్) వెల్గటూర్ మండలంలోని పాశిగామలో జరుగుతున్న పోచమ్మ బోనాలకు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో జగిత్యాల లో జీవన్ రెడ్డి,ధర్మపురి లో అడ్లురి లక్ష్మణ్, వెల్గటూర్ లో మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి,మెరుగు మురళి, వెంకటస్వామి లను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దైవ కార్యక్రమానికి వెళుతున్న మమ్మల్ని అరెస్ట్ చేయడం సమంజసం కాదని,ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు.