కార్మిక శాఖ కార్డు గల ప్రతి ఒక్కరికి ముప్పై రకాల పరీక్షలు ఉచితం : సహాయ కార్మిక శాఖ అధికారి
జగిత్యాల ఎప్రిల్ 20 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా నూతన కలెక్టరేట్ లో ట్రేడ్ యూనియన్లకు భవన నిర్మాణ కార్మిక రంగాల కార్మికుల తో గురువారం జగిత్యాల సహాయ కార్మిక అధికారి కృష్ణ సాగర్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కార్మిక శాఖ కార్డు గల అందరు కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ఆశాఖ ఆధ్వర్యంలో 30 రకాల రక్త, మూత్ర పరీక్షలు ఉచితం గా చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ యాష్మిన్ భాష, అదనపు కలెక్టర్ మకరంద్, మెట్ పల్లి అనిల్. భవన నిర్మాణ కార్మిక రంగాల జిల్లా అధ్యక్షుడు ఎనగందుల గంగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు అంకమా రావు, తరాల చంద్రయ్య, వివిధ ట్రేడ్ యూనియన్ల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.