స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టి సంబంధిత పత్రాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ని ఆదేశించిన హై కోర్టు
జగిత్యాల ఎప్రిల్ 19 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు విషయం పై ఈ నెల 23 వ తేదీ ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టి అన్ని పార్టీల సమక్షంలో రూంలు తెరవాలని ప్రధాన న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీచేసింది.
స్ట్రాంగ్ రూం తాళాలు లేకపోవడం పైన జగిత్యాల జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక పైన విచారణ జరిపిన హై కోర్టు ఎన్నికలకు సంబందించి భద్రపరిచిన ఈవిఎం ల స్ట్రాంగ్ రూం తాళాలను ఈ నెల 23 వ తేదీ ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు పగలగొట్టి సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.
అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరవాలని ఈ సందర్భంగా గౌరవ హై కోర్టు ఆదేశించింది.
స్ట్రాంగ్ రూం తాళాలు మిస్సింగ్ పైన త్రి సభ్య కమిటీ తో విచారణ జరుపుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. విచారణను ఈ నెల 24 తేదీకి వాయిదా వేసింది.