స్తంభంపల్లి ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ భట్టిని కలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామాల ప్రజలు
జగిత్యాల ఎప్రిల్ 18 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్థంబంపల్లి శివారులో నెలకొల్ప తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ కు వ్యతిరేకంగా పాశిగామ, స్థంబంపల్లి, వెంకటాపూరు, వెల్గటూరు గ్రామాల ప్రజలు మంగళ వారం రోజున జగిత్యాల డిసిసి అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మారం మండలం లో కొనసాగుతున్న సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ల పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో వారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఇథనాల్ పరిశ్రమ అంశం పై వారు మాట్లాడుతూ ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమ నెకొల్పాలంటే ఆ ప్రాంత ప్రజల అనుమతి ఖచ్చితంగా అవసరమని. ఆ ప్రజల అనుమతి లేకుండా ఈ ఇథనాల్ పరిశ్రమ పనులను ప్రారంభించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఇట్టి విషయం లో జగిత్యాల జిల్లా కలెక్టర్ కి, సంబంధిత అధికారులకు లేఖ రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.