పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి ఫిర్యాదులకు న్యాయం చేయాలి : ఎస్సీ ఎగ్గడి భాస్కర్
జగిత్యాల ఎప్రిల్ 19 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సోమవారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ ఎగ్గడి భాస్కర్. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధుల నిర్వహణ లో నిమగ్నమయ్యారనే విషయాల్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన కాలనీల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి, భద్రతలు అదుపులో ఉంటాయని ఆయన సూచించారు. టౌన్ పరిసరాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్, ఇతర జంక్షన్ల దగ్గర లైన్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని కావున రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు టౌన్ పోలీస్ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్, టౌన్ ఇన్స్పెక్టర్ రామచందర్రావు ఎస్సైలు రహీం, సందీప్, ట్రాఫిక్ ఎస్.ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.