మంత్రి కొప్పుల ఈశ్వర్ చే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
జగిత్యాల ఎప్రిల్ 17(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం లోని కిషన్ రావుపేట, శాకాపూరు గ్రామాల్లో మంగళవారం ఉదయం పది గంటలకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభిస్తారని భారాస పార్టీ వెల్గటూరు మండల ప్రధాన కార్యదర్శి జూపాక కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు రైతులు ప్రజలు తదితరులు సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుమార్ విజ్ఞప్తి చేశారు.