ఉండెడ గ్రామ భారాస పార్టీ గ్రామ శాఖ ఎన్నిక
జగిత్యాల ఎప్రిల్ 12 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం భారాస పార్టీ మండల అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో ఉండేడ గ్రామ స్థాయి ఆ పార్టీ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక బుధవారం జరిగింది.అధ్యక్షుడుగా గంధం తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా చొప్పదండి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడుగా చిలుక అశోక్, సంయుక్త కార్యదర్శిగా మేన అంజయ్య, కోశాధికారిగా ఆవుల తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా తుడిచెర్ల సతీష్, అడెపు రాజేశం, చిలువేరు లక్ష్మీనారాయణ, మారం లచ్చయ్య, చింత అంజయ్య, కటుకూరి చుక్కయ్య లు ఎన్నికయ్యారు.
ఉండెడ గ్రామ కమిటీని ఉద్దేశించి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందర్నీ కలుపుకొని గ్రామంలో బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు సుధగాని శ్రీనివాస్, మ్యాన రాయమల్లు, గంధం రవి, పోతు ప్రభాకర్ గంధం కిరణ్, చిలక రాకేష్, గంధం ఆనందం, పోతు కాంతయ్య, పోతు తిరుపతి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.