సీఎంఆర్ఎఫ్, ఆర్ అండ్ ఆర్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల ఎప్రిల్ 9 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లోని సమావేశ మందిరం వెల్గటూరు, ఎండపల్లి మండలాలకి ముఖ్యమంత్రి సహాయ నిధి, పునరావాసం, పునరావాస చెక్కులను ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన పదిహేను లక్షల ముప్పై ఆరు వేయిల రూపాయల చెక్కులు మరియు పునరావాసం , పునరావాస కార్యక్రమాల ద్వారా ఒక కోటి యాభై తొమ్మిది లక్షల విలువ గల చెక్కులును లబ్ది దారులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో భారాస పార్టీ ఎండపల్లి మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, వెల్గటూరు, ఎండపల్లి మండలాల కార్యకర్తలు, అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.