భాజాపా నేతలు అరెస్టు వెల్గటూరు పోలీసు స్టేషన్ కు తరలింపు
జగిత్యాల ఎప్రిల్ 5 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు, ఎండపల్లి మండలాల భాజాపా నేతలను బుధవారం పోలీసులు అరెస్టు చేసి వెల్గటూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. అరెస్టైన వారిలో భాజపా జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రాజారాంపల్లి ఎంపీటీసీ గాజుల మల్లేశం, వెల్గటూరు ఉమ్మడి మండల అధ్యక్షుడు తంగళ్ళపల్లి చక్రపాణి, కొత్తపేట సర్పంచ్ కొమ్ము రాం బాబు, దళిత మోర్చ మండలాధ్యక్షుడు న్యాతరి మల్లేశం లు ఉన్నారు. పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, అదే విధంగా మిమ్మల్ని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భావం స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ కి బాధ్యత వహిస్తు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ లు నైతిక బాధ్యత తో రాజీనామా సమర్పించాలని భాజపా జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం డిమాండ్ చేశారు.