Sunday, September 8, 2024
Homeతెలంగాణముంపు గ్రామాల రైతులు ఆందోళన

ముంపు గ్రామాల రైతులు ఆందోళన

ముంపు గ్రామాల రైతులు ఆందోళన

రెండు గంటల పాటు రాస్తారోకో

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్               

మంథని మార్చి 20(కలం శ్రీ న్యూస్):మంథని మండలంలోని ఆరెంద, వెంకటాపూర్, రామయ్య పల్లి గ్రామాలకు చెందిన రైతులు సోమవారం మంథని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ మూడు గ్రామాల్లోని సుమారు 450 ఎకరాల వ్యవసాయ భూములు ముంపుకు గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన ఈ ధర్నా వల్ల వాహనాలు అన్ని చౌరస్తా ప్రాంతంలో నిలిచిపోయాయి. ముంపు వల్ల నష్టపోతున్న తనకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని రైతులు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఆర్డీవో తమకు హామీ ఇస్తే కానీ ఇక్కడి నుండి విశ్రమించేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. మంథని ఎమ్మార్వో బండి ప్రకాష్ రైతుల వద్దకు వచ్చి మీ డిమాండ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.ఈ సందర్భంగా మంథని ఎస్ఐ వెంకటేశ్వర్లు రైతులను సమన్వయపరిచి ఎలాంటి ఆందోళనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ధర్నా కార్యక్రమంలో ఈ మూడు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. రైతులకు అఖిలపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!