‘హాత్ సే హాత్’ జోడో యాత్రను విజయవంతం చేయండి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల, మార్చి (3 కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘హాత్ సే హాత్ ’ జోడో యాత్ర కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రోజున వాణి నగర్ చౌరస్తా నుండి నాలుగు వార్డుల మీదుగా లింగంపేట వరకు పాద యాత్ర నిర్వహించబడుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.ఈ యాత్రలో ఇంటింటికీ వెళ్లి గతంలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి పార్టీ తరపున పోరాటం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.