Saturday, July 27, 2024
Homeదేశంలోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్టమస్

లోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్టమస్

లోక రక్షకుడు క్రీస్తు జన్మదినమే క్రిస్టమస్

ముస్తాబైన చర్చీలు

హైదరాబాద్,డిసెంబర్25 (కలం శ్రీ న్యూస్):అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్‌. ప్రపంచంలోని క్రైస్తవులంతా మనస్ఫూర్తిగా సంతోషంతో జరుపుకునే సంబరం. వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. న‌గ‌రంలోని చ‌ర్చిలు ఆద్యాత్మిక‌త‌ను సంత‌రించుకున్నాయి. క్రిష్ట‌మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ‌ చర్చిలను అందంగా అలంక‌రించారు. ప్రేమ, కరుణకు ప్రతీక అయిన ఏసు క్రీస్తు పుట్టిన రోజు క్రిష్టమస్ పండుగ‌ను దేశవ్యాప్తంగా క్రైస్తవ భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. క్రీస్తును ఆరాధిస్తూ కళాకారులు పాడుతున్న పాటలతో చర్చిల్లో సందడి కనిపిస్తోంది. క్రిస్ మస్ సంబరాలకు యావ‌త్ దేశం ముస్తాబైంది.మహిమాన్వితమైన క్రీస్తు బోధలతో చర్చిలలో లలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. చ‌ర్చిల్లో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. చిన్నా పెద్దా అంతా కలిసి క్రిస్ మస్ ప్రేయర్లు చేస్తున్నారు. ఎటు చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. భ‌క్తులు, సంద‌ర్శ‌కుల‌ను ఆకట్టుకునేలా చర్చిల‌ను అందంగా డెకరేట్ చేశారు. దేశవ్యాప్తంగా అర్థరాత్రి నుంచే క్రిస్ మస్ హోలీ ఫీస్ట్ సంబరాలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో ప్రత్యేక అలంకరణలతో చర్చిలన్నీ జిగేల్ మంటున్నాయి

క్రిస్మస్ అనగానే ప్రతి ఇంటిపై వెలిగే నక్షత్రాలు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతాయి. దాదాపు ప్రతి క్రిస్టియన్ ఇంటిపైనా స్టార్ లను పెడతారు. ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. రంగురంగుల బెలూన్లు, అలకంరణ వస్తువులతో చర్చిలను డెకరేట్ చేస్తారు. కానీ ప్రతి అలంకరణకు కారణముంది. వేడుకల్లో పరమార్థముంది. యేసు ప్రభువు బెత్లహేంలో జన్మించినప్పుడు జ్ణానులకు దారి చూపించింది నక్షత్రమే. అది దేవుడు ఏర్పాటు చేసిన న‌క్ష‌త్ర‌మ‌ని అని క్రైస్తవుల నమ్మకం. అందుకే ప్రతి ఇంటిపై స్టార్ పెడతారు. తమ ఇంట్లోనూ క్రీస్తు జన్మించాడని సూచికగా స్టార్‌ను వేలాడదీస్తారు.

ఇక క్రిస్మస్ చెట్టు. స్టార్లు, బెలూన్లు, గ్రీటింగ్ కార్డులతో అందంగా ముస్తాబవుతుంది ట్రీ. దీనికీ ఓ కథ ఉంది. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో తారలు దేదీప్యమానంగా వెలిగాయి. పువ్వులు అందంగా వికసించాయి. పండ్లతో చెట్లు ఫలాలనిచ్చాయి. ప్రక్రుతిలోని ప్రతిదీ పరవశించింది. కానీ క్రిస్మస్ ట్రీ ఏమంత అందంగా ఉండదు. స్టార్ల వెలుగును చూసి, పువ్వుల నవ్వులు చూసి తాను ఏమీ బాలేనని డల్ అయి పోతుందట క్రిస్మస్ చెట్టు. ఆకాశం నుంచి క్రిస్మస్ ట్రీ విచారం చూసిన నక్షత్రాలు చాలా బాధపడ్డాయి. వెంటనే నక్షత్రాలన్నీ చెట్టుపై వాలిపోయాయట. దీంతో అన్నిటికన్న క్రిస్మస్ ట్రీ అందంగా తయారైందని చెప్తుంటారు. అందుకే క్రిష్ట‌మ‌స్ ప‌ర్వ‌దినాల్లో క్రిష్ట‌మ‌స్ చెట్టుకు కూడా మంచి ప్రాధాన్య‌తనిస్తారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!