శబరిమల ఆలయంలో పూజారి మృతి.. సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం..
కేరళ,డిసెంబర్7(కలం శ్రీ న్యూస్):కేరళలోని పథనంతిట్టా జిల్లాలోని పవిత్ర క్షేత్రం శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయంలో మండల మకరవిళక్కు పూజలు కొనసాగుతున్నాయి. అయ్యప్ప స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. అయితే శబరిమల అయ్యప్ప ఆలయంలోని సహాయ పూజారి హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. మృతుడు తమిళనాడులోని కుంభకోణానికి చెందిన రామ్ కుమార్ (43)గా గుర్తించారు. గురువారం ఉదయం ఆలయంలోని గదిలో కుప్పకూలి పడి ఉన్నాడు. గుర్తించిన వెంటనే ఆలయ సన్నిధానం ఆస్పత్రికి హుటాహుటిన తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన నేపథ్యంలో నేడు అయ్యప్ప ఆలయాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచారు. శుద్ధి కార్యక్రమం అనంతరం ఆలయాన్ని తెరిచారు. ఆలయాన్ని శుద్ధి చేసి కార్యక్రమం అయిన తర్వాత ఆలయం తలుపు తెరవడంలో జాప్యం అయింది.20 దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు ఆలయ బయట చాలాసేపు వేచి ఉన్నారు.
మరోవైపు అయ్యప్ప సన్నిధానంలో రద్దీ నెలకొంది. రద్దీని నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పతనంతిట్ట జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. గత కొద్ది రోజులుగా అయ్యప్ప దర్శనం కోసం భక్తులు 10 గంటలకు పైగా నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితి అదుపులో పెట్టె విధంగా చర్యలు తీసుకోమని కోర్టు ఆదేశించింది.