Thursday, October 10, 2024
Homeదేశంమళ్లీ తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

మళ్లీ తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

మళ్లీ తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

న్యూ ఢిల్లీ, జూన్ 02,(కలం శ్రీ న్యూస్):

తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆదివారం లొంగిపోయారు. ఇటీవల లోక్ సభ ఎన్నికలకు ప్రచారం చేసుకునేందుకు సుప్రీం కోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేటితో జూన్ 2 మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లారు.

కాగా అనారోగ్యం కారణంగా తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీం కోర్టులో సీఎం కేజ్రీవాల్ పిటిషన్ వేయగా.. ఆ పిటిషన్ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కేజ్రీవాల్ ఇంటినుంచి బయలు దేరిన తరువాత మార్గం మధ్యలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత కన్నాట్ ప్లేస్‌ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడి ఆశీస్సులు పొందారు. లొంగిపోయే ముందు ఆయన ఆప్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి కార్యకర్తలు, పార్టీ నేతల తోచర్చించి ఆ తర్వాత తీహార్ జైలులో లొంగిపోయారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!