Saturday, July 27, 2024
Homeదేశంరాజ్యాంగ నిర్మాత రాజగృహను, చైత్య భూమిని సందర్శించిన మంథని అంబేద్కర్ వాదులు.

రాజ్యాంగ నిర్మాత రాజగృహను, చైత్య భూమిని సందర్శించిన మంథని అంబేద్కర్ వాదులు.

రాజ్యాంగ నిర్మాత రాజగృహను, చైత్య భూమిని సందర్శించిన మంథని అంబేద్కర్ వాదులు.

ముంబయి,నవంబర్24(కలం శ్రీ న్యూస్):మహరాష్ట్ర లోని ముంబాయిలో ఉన్న రాజ్యాంగ నిర్మాత ,భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.అర్. అంబేద్కర్  నివాస భవనం రాజగృహతో పాటు వారి స్మారక కేంద్రాన్ని, సమాధిని సందర్శించి ఘనంగ నివాళులు అర్పించిన మంథని ప్రాంత అంబేద్కర్ వాదులు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆ మహనీయుడు నివసించిన రాజగృహను సందర్శించడం ద్వారా పునీతులం అయినట్టుగా భావిస్తూ కొత్త అనుభూతి కలిగింది.ఆయనకు చెందిన రెండు అంతస్తులుగా ఉన్న నివాస భవనంలో వారి జీవన గమనంలో వాడిన పలు వస్తువులను, ఇంటిని పరిశీలించిన తర్వాత వారు ఎంతో సాదాసీదాగా జీవితంను కొనసాగించినట్టుగా స్పష్టం అవుతుంది. వారు ఉన్న ఇంటి పై అంతస్తుల్లో ఉన్న మూడు గదుల్లో దాదాపు 50 వేల పుస్తకాలతో ఏర్పాటు చేసిన లైబ్రెరీ కోసం దగ్గర్లో ఉన్న మరో ఇంటిని అమ్మి ప్రజల విజ్ఞానం కోసం జీవితం త్యాగం చేసిన విషయాన్ని కూడా గమనించడం జరిగింది.ఈ సంధర్భంగా భారత రాజ్యాంగాన్ని రచించి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపిన రాజగృహ కు నడి రోడ్డు పై నెత్తుటి టేరులు పారించీ రక్త చరిత్రను రచించి ఉన్న ఓ నాయకుడు తనకు తానుగా అభివర్ణించుకొని నిర్మించుకొని ఓ మహనీయుడి చరిత్రను మలినం చేస్తున్న రాజగృహ లో ఉన్న తేడాను చూసి మంథని నియోజక వర్గ ప్రజలకు వివరించడానికి తాము ఇంత దూరం రావడం జరిగింది.సమాజం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి తాను నిర్మించుకున్న రాజగృహలో సాదాసీదాగా జీవితం గడిపిన మహనీయుడి ఆలోచన విధానాన్ని, తన స్వార్థం కోసం బహు జనులను బలి చేస్తూ కోట్లాది రూపాయలతో విలాస వంతమైన భవనాన్ని ఇక్కడ నిర్మించుకొని దాని పేరు రాజగృహ అని పెట్టుకొని బహు ధనవంతుడు… బహూ జన వంతుడిగా నటిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరడం జరిగింది.రాజగృహ సందర్శన తర్వాత చైత్య భూమి లో ఉన్న అంబేద్కర్ గారి స్మారక కేంద్రాన్ని, నిత్యజ్యోతిని, సమాధిని సందర్శించి ఘనంగా నివళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంథని ప్రాంతానికి చెందిన అంబేద్కర్ వాదులు మంథని ఎంపిపీ కొండ శంకర్ ,న్యాయవాది,నాగారం సర్పంచ్  బూడిద మల్లేష్, పర్ష శ్రీనివాస్ , బిసీ నాయకులు ఇనుముల సతీష్ , మైనార్టీ నాయకులు అజీమ్ ఖాన్,గిరిజన నాయకులు కిషన్ నాయక్  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!