శబరిమల సన్నిధానం మేల్‌శాంతిగా మహేశ్ నంబూద్రి
తిరువనంతపురం, అక్టోబరు 18(కలం శ్రీ న్యూస్):శబరిమలలో బుధవారం సాయంత్రం మేల్‌శాంతుల(ప్రధానార్చకులు) ఎంపికకు నిర్వహించిన కార్యక్రమంలో పందలం రాజవంశానికి చెందిన ఇద్దరు చిన్నారులు డ్రా తీశారు. ఇందులో శబరిమల సన్నిధానం మేల్‌శాంతిగా మహేశ్ నంబూద్రి, మాలికాపురం ఆలయ మేల్‌శాంతిగా మురళి నంబూద్రి ఎంపికయ్యారు.
శబరిమల యాత్ర వాహనాలకు అలంకరణలొద్దు
శబరిమల యాత్రికుల వాహనాలకు అలంకరణలు చేయొద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ తరహా అలంకరణలతో ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరుగుతున్నందున.. భక్తులు తమ వాహనాలకు కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పూలతో అలంకరణ చేయడాన్ని నిలిపివేయాలని సూచించింది. ఓ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.