Friday, October 18, 2024
Homeతెలంగాణతెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్

తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్

తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్

హైదరాబాద్,జులై10(కలం శ్రీ న్యూస్):

తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఇన్ ఫోర్స్ మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. కాగా తెలంగాణలోని నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా తొలుత విధులు నిర్వర్తించారు.కాగా 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీవిరమణ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!