Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్ఏ.పి సీఎంగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం

ఏ.పి సీఎంగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం

ఏ.పి సీఎంగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం

విజయవాడ,జూన్12(కలం శ్రీ న్యూస్):

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే.. ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!