Sunday, September 8, 2024
Homeతెలంగాణప్రతి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే

ప్రతి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే

ప్రతి పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్టి పుట్ట మధూకర్‌

మంథని,అక్టోబర్23(కలం శ్రీ న్యూస్):పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని కులాలు, మతాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ అన్నారు.

విజయదశమి పండుగను పురస్కరించుకుని మంథని పట్టణంలోని రాజగృహాలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మత పెద్దలతో కలిసి ఆయన సహపంక్తి బోజనం చేశారు. దసరా పండుగ రోజున అన్ని మతాల వారితో ఒక్కచోట కలిసి బోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి అన్ని వర్గాలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వాలు కులాలు,మతాలను వాడుకుని అధికారం కోసం ఆశపడ్డారే కానీ ఏనాడు అందరిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చి ఐక్యతతో ఉండేలా ఆలోచన చేయలేదని అన్నారు.కానీ ఈనాడు సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి హిందూ, ముస్లిం, క్రిష్టియన్‌ల సంప్రదాయాలకు అనుగుణంగా అతిపెద్దగా జరుపుకునే బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌లాంటి పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ ప్రభుత్వపరంగా కానుకలు అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ముందుచూపుతో గొప్పగా ఆలోచన చేయడం, బావితరాల భవిష్యత్‌ గురించి గొప్పగా ఆలోచన చేయడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌పాలన ప్రతి వర్గాలకు భరోసా ఇస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!