Sunday, September 8, 2024
Homeతెలంగాణమంథని సామాజిక వైద్య శాలలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరు.. 

మంథని సామాజిక వైద్య శాలలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరు.. 

మంథని సామాజిక వైద్య శాలలో ఐదు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరు.. 

ఏఐసీసీ కార్యదర్శి,ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్): డయాలసిస్ సెంటర్ మంజూరుకు కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్ బాబు.మంథని నియోజకవర్గంలో కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాదిగస్తులు రోజురోజుకు అధిక సంఖ్యలో నమోదు అవుతున్న నేపథ్యంలో మంథని ప్రాంతంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ నెలకొల్పాలని గత నెల ఏప్రిల్ 23 న తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కి,ప్రతిపాదనలు సమర్పించగా మంగళవారం ప్రభుత్వం డయాలసిస్ సెంటర్ మంజూరు చేయడం జరిగింది.మంథని ప్రాంతంలో డయాలసిస్ సేవలు లేకపోవడం వల్ల రోగులు చికిత్స కోసం కరీంనగర్, వరంగల్,హైదరాబాద్ తదితర దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుండడంతో రోగులు డయాలసిస్ చేయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి ఖర్చులు,రవాణా,బస చార్జీలు దూర ప్రాంతాలకు చికిత్స పొందినందుకు అవసరమైన నిరీక్షణ సమయం వారి కుటుంబానికి పెద్ద భారంగా మారిందని,దీంతో చాలామంది రోగులకు సకాలంలో వైద్య సేవలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.మంథని సామాజిక వైద్య శాల(సిహెచ్ సి ) లో డయాలసిస్ సెంటర్ మంజూరు కృషి చేసిన ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి మంథని ప్రజలు, నిత్యం దూర ప్రాంతాలకు డయాలసిస్ సేవలు కోసం వెళ్లే మంథని కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!