Friday, November 22, 2024
Homeతెలంగాణమామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల ఎప్రిల్ 23 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాముల పల్లెలో ఆదివారం రోజున నెల రాలిన మామిడి తోటలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి బీభత్సానికి నేల రాలిన కాయలతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం రూపొందించిన పంటల బీమా పథకం, ఫసల్ బీమా యోజన లో భాగస్వామ్యం కాకపోవడంతో పాటు పంటల బీమా పథకం రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అకాల ఈదురు గాలులతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారమందని పరిస్థితి నెలకొందని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి మామిడి రైతులకు ఎకరానికి 50 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల సమన్వయ లోపంతో తెలంగాణ రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని, స్వామి నాథన్ నివేదిక ప్రకారం పెట్టుబడికి రెండింతలు దిగుబడి వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని, నష్టపోయిన మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!