అంబేద్కర్ జయంతి సందర్భంగా నిరుపేద దళిత మహిళ కు సరుకుల వితరణ
జగిత్యాల ఎప్రిల్ 14 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన నిరుపేద దళిత మహిళ జైన తారకు కు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పేద కుటుంబాల ఆర్య వైశ్య సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ నిత్యావసర సరుకులు బట్టలు పంపిణీ చేశారు.
జైన తార గత మూడు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఆమె భర్త గత కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆమెకు ఒక కూతురు ఉంది. వారి ఆర్థిక పరిస్థితి కుటుంబ పోషణ బాగా లేదన్న విషయం తెలుసుకున్న తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్త కష్టాల్లో ఉన్న వారి ఇంటికి వెళ్లి రెండు చెద్దర్లు, రెండు చీరలు, 25 కిలోల బియ్యం తో పాటు సుమారుగా మూడువేల రూపాయల విలువైన నిత్యవసర వస్తువులు అందజేశారు.
ఈసందర్భంగా అంబారిపేట గ్రామస్తులు రమేష్ గుప్త ఉదారత స్వభావాన్ని అభినందించారు. కార్యక్రమంలో చెరుక కేశవ్, జైన బానయ్య, చెరుక నర్సయ్య, బండారు గంగరాజు, గోల్లె సురేష్, మోతే నరేష్ బండారి మల్లేష్, ముంజాల మంగ, దూట శంకరమ్మ, దూట సులోచనలు పాల్గొన్నారు.