Sunday, September 8, 2024
Homeతెలంగాణపోచమ్మ బోనాలు ఉత్సవాలకు హాజరైన మంత్రి కొప్పుల సతీమణి స్నేహలత

పోచమ్మ బోనాలు ఉత్సవాలకు హాజరైన మంత్రి కొప్పుల సతీమణి స్నేహలత

పోచమ్మ బోనాలు ఉత్సవాలకు హాజరైన మంత్రి కొప్పుల సతీమణి స్నేహలత

జగిత్యాల, మార్చి 01 (కలం శ్రీ న్యూస్):

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే పోచమ్మ బోనాలు ఉత్సవాలు బుధవారం రోజున ఎండపల్లి మండల కేంద్రంలో అత్యంత వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత హాజరయ్యారు.అధిక సంఖ్యలో మహిళలు సామూహిక పోచమ్మ బోనాలు ఊరేగింపులో పాల్గొన్ని పోచమ్మ అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొప్పుల స్నేహలత బోనాల ఉత్సవాల్లో బోనం ఎత్తుకొని, ప్రత్యేక పూజలు చేసి, ఈ సంవత్సరం మంచిగా ఎండపల్లి నూతన మండల కేంద్రములో చెరువులు, కుంటలు నిండి పాడి, పంటలు పండి, రైతులు పిల్ల, పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని స్నేహలత వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ బోనాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలను చాటి చెప్పుతున్నాయన్నారు. 

ఎండపల్లి గ్రామంలో సామూహిక బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సామూహిక బోనాల ఊరేగింపులో బ్యాండు మేళాలు, దరువులు యువతీ, యువకుల కేరింతల, నృత్యాలు ప్రజలను ఆనందింప జేసి చూపరులను ఆకర్షింప జేశాయి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!