కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలి
కౌన్సిలర్ కూకట్ల గోపి
సుల్తానాబాద్, ఫిబ్రవరి 24(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పేదల జీవితాల్లో వరం లాంటిదని, ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కూకట్ల గోపి అన్నారు.గురువారం మండల కేంద్రంలోని 7వవార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు వైద్య పథకాలను ప్రవేశ పెడుతూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి సూచన మేరకు ప్రతి వార్డులో క్యాంపు నిర్వహిస్తూ, ఆయా వార్డులోనిఅర్హులను గుర్తించి కంటి అద్దాలతోపాటు మందులు, అవసరమైన వారికి ఆపరేషన్లు ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తుందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మధుకర్ రెడ్డి, శ్రీజ, హెచ్ ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, ఏ.ఎన్.ఎం లు సరస్వతి, శారదా, కవిత ,ఆర్పీ మంజుల, వార్డు ఆఫీసర్ రమేష్, ఆశ వర్కర్ల తో పాటు పలువురు పాల్గొన్నారు.