ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గా రామకృష్ణ
కరీంనగర్,నవంబర్28(కలం శ్రీ న్యూస్):
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 70వ జాతీయ మహాసభలు ఈ నెల 22,23,24 తేదీలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని గోరఖ్ పూర్ లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జాతీయ మహాసభలలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగా, సామాజిక సమస్యలు ఇలా అనేక రకాల సమస్యల పైన తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ శరన్ సాహి నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది.ఈ యొక్క జాతీయ కార్యవర్గంలో కరీంనగర్ విభాగ్ సంఘటన కార్యదర్శి గా పనిచేస్తున్న రామకృష్ణ ని రెండవసారి జాతీయ కార్యవర్గ సభ్యుడు గా ఎంపిక స్థానం కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఏబీవీపీ జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా, వ్యక్తి నిర్మాణం ద్వారానే సమాజం నిర్మాణం అవుతుంది అనే ఆలోచనతో పని చేస్తుంది అన్నారు.ఏబీవీపీ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు విద్యారంగ సమస్యలపైన అనునిత్యం స్పందిస్తూ, సమాజంలో జరుగుతున్న సమస్యలపైన అనునిత్యం స్పందిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పని చేయడం జరుగుతుంది అన్నారు. అలాంటి అతిపెద్ద సంస్థలో నన్ను నమ్మి ఏబీవీపీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించిన జాతీయ, రాష్ట్ర పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసారు.రామకృష్ణ నియామకం పట్ల తెలంగాణ, కరీంనగర్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.