రాష్ట్రస్థాయి ఓపెన్, అండర్ 13 చదరంగం పోటీల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.
కరీంనగర్,జూన్29(కలం శ్రీ న్యూస్):
జులై నెలలో 6,7 తేదీలో అలుగునూర్ లోని లక్ష్మీనరసింహ కన్వెన్షన్ హాల్లో 75 వేల నగదు బహుమతితో పాటు భోజన సదుపాయం, 100 ట్రోఫీలతో జీనియస్ చెస్ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర డెమొక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించే రాష్ట్రస్థాయి ఓపెన్, అండర్ 13 పోస్టర్ ను శనివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ల చేతుల మీదుగా ఆవిష్కరించబడినది. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోఎస్ అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాసరెడ్డి, సంగం లక్ష్మణరావు, జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, స్టేట్ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనుప్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శులు కంకటి సుజన్, తాటిపల్లి సతీష్ బాబు, జిల్లా డెమొక్రటిక్ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు అంతగిరి కుమార్, కేశెట్టి జగన్, కమిటీ సభ్యులు రేవిక్, నితిన్, తదితరులు ఉన్నారు.పూర్తి వివరాల కోసం టోర్నమెంట్ డైరెక్టర్ కంకటి అనుప్ కుమార్ సెల్ నెంబర్ 8341206989.9160160161ను సంప్రదించాలని కోరారు.