బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సుల్తానాబాద్ బిజెపి నాయకులు
కరీంనగర్,జూన్20(కలం శ్రీ న్యూస్):
భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం సహాయమంత్రి బండి సంజయ్ కేంద్ర హోం సహాయమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ వచ్చిన సందర్భముగా మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందించి, శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన సుల్తానాబాద్ మున్సిపాలిటీ బిజెపి నాయకులు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు, మహిళా మోర్చ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్.ఎన్.సి.వనజా, పట్టణ ప్రధాన కార్యదర్షి గజభింకర్ పవన్, పార్లమెంట్ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గుడ్ల వెంకటేష్, సుల్తానాబాద్ ఛత్రపతి శివాజీ అధ్యక్షులు ఎలగందుల సతీష్, బిజెపి సీనియర్ నాయకులు చిట్టవేని సదయ్య తదితరులు పాల్గొన్నారు.