తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
సుల్తానాబాద్,ఆగష్టు7(కలం శ్రీ న్యూస్):
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా గవర్నర్ పిలుపు మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విశిష్టత పై గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కో-ఆర్డినేటర్ లయన్ మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ… తల్లిపాల యొక్క ప్రాధాన్యతను తెలుపడానికి ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారని, అమృత తుల్యమైన తల్లిపాల లో శిశువు యొక్క సమగ్రాభివృద్ధికి కావలసిన పిండి పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, ఖనిజాలు, విటమిన్లతో పాటు వివిధ పోషకాలతో కూడిన ఆహారం సమపాళ్లలో లభిస్తాయని, అంతేకాకుండా తల్లి రొమ్ము పాలు ఇవ్వడం వలన న్యుమోనియా, కామెర్లు లాంటి వైరస్ లను ఎదుర్కోవడం తో పాటు జీవితకాలం అత్యంత సహజసిద్ధంగా రక్షించే చక్కని టీకాగా పనిచేస్తుందని, తద్వార తల్లికి రొమ్ము క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుందని తెలుపుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తల్లిపాలను తమ బిడ్డలకు అందించి మంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, కోశాధికారి పూసాల సాంబమూర్తి, సభ్యులు ఆడెపు సదానందం, దాసరి ప్రసాద్, నాగ మల్ల ప్రశాంత్ కుమార్, ఏ.ఎన్.ఏం శారద, అంగన్వాడి టీచర్లు విజయలక్ష్మి, అంజలి ఆశా వర్కర్లు స్వరూప, సుగుణ లతో పాటు బాలింతలు, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.