Monday, February 10, 2025
Homeదేశంశబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’

శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’

శబరిమలలో దర్శనమిచ్చిన ‘మకరజ్యోతి’

కేరళ,జనవరి14(కలం శ్రీ న్యూస్):

శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఆలయానికి సమీపంలోని పొన్నాంబళమేడు పై మకర జ్యోతి కనిపించింది. పొన్నంబలమేడు పై భక్తులకు మకరజ్యోతి మూడు సార్లు కనిపించింది. జ్యోతి దర్శన సమయంలో శబరిగిరులు అయ్యప్ప నామస్మరణతో మార్మోగాయి.జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. సాయంత్రం 6:46 గంటలకు జ్యోతి దర్శనమిచ్చింది. ఇక మకరజ్యోతి దర్శన నేపథ్యంలో… శబరిమలలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

శబరిమల మకరజ్యోతి లేదా మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు లేదా శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. మకరజ్యోతి దర్శనానికి లక్షలాది మంది భక్తులు శబరిమల ఆలయానికి వస్తుంటారు. జ్యోతి దర్శనం కోసం అయ్యప్పస్వామి భక్తులు పోటెత్తుతారు. దీంతో శబరిమల మకరజ్యోతి సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే శబరిమల మకరజ్యోతి ఘట్టం 2-3 నిమిషాల పాటు నిర్వహించే కార్యక్రమం. శబరిమల కొండపై శబరిమల మకరజ్యోతి దర్శనం రోజున యాత్రికుల ఆలయ నిర్వాహకులు మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలో మాత్రమే జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

శబరిమల మకరవిళక్కు. శబరిమల ఆలయ బోర్డు నిర్వహించబడే ఒక కార్యక్రమం, భక్తులు శబరిమల ఆలయం నుంచి నేరుగా శబరిమల మకరజ్యోతిని వీక్షించవచ్చు. మకర జ్యోతి వీక్షించేందుకు భక్తుల కోసం ఆలయ అధికారులు వివిధ వ్యూ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. భక్తులు శబరిమల మకరవిళక్కును టీవీలలో వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ట్రావెన్ కోర్ కమిటీ భారీ భద్రతలు ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!