పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి
పెద్దపల్లి,డిసెంబర్15(కలం శ్రీ న్యూస్):బైక్ అదుపు తప్పి యువ కుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో జరిగింది.కాల్వ శ్రీరాంపూర్ మండ లానికి చెందిన రోహిత్ గౌడ్ వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై కాల్వ శ్రీరాంపూర్ నుంచి మల్యాలకు వెళ్లారు.అయితే పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద అదుపు తప్పి బైక్ బోల్తా పడింది.
దీంతో రోహిత్ అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు స్థాని కులు తెలిపారు.సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు,రోహిత్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి హాస్పి టల్‌కు తరలించారు.కే కిసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…