కేటీఆర్ ను కలసిన ఐల రమేష్
సుల్తానాబాద్, అక్టోబర్ 29 (కలం శ్రీ న్యూస్): రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి నియోజకవర్గం నుండి దాసరి మనోహర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మాజీ ఎంపీపీ, జడ్పిటిసి, సర్పంచ్ ఐల రమేష్, నియోజకవర్గ ఇంచార్జి, కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. కెటిఆర్ కు అయిల రమేష్ పుష్పగుచ్చం అందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సారథ్యంలో రాష్ట్రంలో తిరిగి మూడోసారి బి.ఆర్.ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని జ్యోతిష్యం చెప్పారు. మన ప్రభుత్వం ప్రస్తుతం 9 సంవత్సరాల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలు విశ్వసిస్తున్నారని, రానున్న ఎన్నికలలో 100 సీట్లను కైవసం చేసుకొని అధికారం చేపడతామని, ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి, కార్యకర్త సైనికుల పనిచేసి ముఖ్యమంత్రి చేపట్టిన అభివృద్ధిని, చేపట్టబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, పార్టీ విజయానికి దోహదపడాలని సూచించారు. బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఐల రమేష్ మనోహర్ రెడ్డి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో తన రాజకీయ భవిష్యత్తుకు తనదే బాధ్యతనని తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు. మనోహర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, నాయకులు కోమటిపల్లి సదానందం, గుంజ పడుగు హరి ప్రసాద్, గొట్టం మహేష్, కొండ సత్యనారాయణ, వేణి శెట్టి రాంకుమార్, మహేష్, బైరగొని రవీందర్, కొయ్యడ రమాకాంత్, రమణ లతోపాటు పలువురు ఉన్నారు.